హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది'

W.G: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని YCP జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు విమర్శించారు. శుక్రవారం పాలకొల్లులో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి నేతలు అమలు చేయలేదని ఆరోపించారు. మున్సిపాలిటీల్లో సమస్యల పరిష్కారానికి YCPకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.