హైదరాబాద్: 28°C
తెలంగాణ

NI యాక్ట్ కేసులపై నేడు ప్రత్యేక లోక్ అదాలత్

జనగామ జిల్లా కోర్టులో నేడు (శనివారం) NI యాక్ట్ కేసులపై ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. రాజీ పడటమే అన్నింటి కన్న రాజమార్గమని పేర్కొన్నారు.