హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం సభతో హరీశ్ కలవరం: కాంగ్రెస్

సిద్దిపేటలో జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి సభతో హరీశ్‌రావు కలవరపడుతున్నారని కాంగ్రెస్ నేతలు శుక్రవారం విలేకరుల సమావేశాల్లో ఆరోపించారు. ప్రభుత్వ విప్ వేముల వీరేశం సభకు సుమారు 40 వేల మంది హాజరయ్యారని, రూ.540 కోట్ల అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. ఎమ్మెల్సీ నాయిని రాజేందర్‌రెడ్డి, విప్ బాల్మూరి వెంకట్ హరీశ్‌రావు విమర్శలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.