హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్‌లో అమృత్ పనుల్లో జాప్యం

KNR: కరీంనగర్ బైపాస్ వద్ద చేపట్టిన రూ.145.5 కోట్ల అమృత్ 2.0 భారీ నీటి ట్యాంకు పనులు ఏడాదిన్నరగా సాగుతున్నా పూర్తి కాలేదు. విలీన గ్రామాలకు 10 ఎంఎల్‌డీ నీరు అందించాల్సి ఉంది. జూలై 2026, డిసెంబర్ 2026 గడువులు దాటుతున్నాయి; వేసవి 2027 నాటికి పూర్తి లక్ష్యం. ఉమ్మడి జిల్లాలో 34 పనులకు రూ.936.16 కోట్లు మంజూరు కాగా, ఉప కాంట్రాక్టులే జాప్యానికి కారణమని స్థానికులు తెలిపారు.