JN: చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన జోగు రాజు (35) శుక్రవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కూలి పనులు చేస్తూ, ఆటో నడుపుకుంటూ జీవించే రాజుకు భార్యతో జరిగిన గొడవ నేపథ్యంలో క్షణికా ఆవేశంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య


