హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ బీమా ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్

ADB: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలును వేగవంతం చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శుక్రవారం గూగుల్ మీట్ ద్వారా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆన్‌లైన్ నమోదు తర్వాత రిజిస్టర్‌లో కచ్చితంగా లబ్ధిదారుడి సంతకమే తీసుకోవాలని, ఇతరులను అనుమతించవద్దని స్పష్టం చేశారు. నమోదు పూర్తయ్యాక రసీదు అందించాలని కలెక్టర్ సూచించారు.