PDPL: ధర్మారం మండలం నంది మేడారంలో శుక్రవారం సాయంత్రం పోలీసులు బెల్టు షాపులను తనిఖీ చేశారు. దూడ శ్రీధర్, దూడ రవి షాపులలో 20 లీటర్ల లిక్కర్ పట్టుకున్నారు. లిక్కర్ సీజ్ చేసి, నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ
బెల్టు షాప్ నిర్వాహకులపై కేసు నమోదు


