హైదరాబాద్: 28°C
తెలంగాణ

డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా

KMM: ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎఫ్‌సీఐ గోదాం సమీపంలో శుక్రవారం రాత్రి కారు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. కారులో ఉన్న నలుగురిలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, ఇద్దరు మహిళలు, చిన్నారి క్షేమంగా బయటపడ్డారు. ఎయిర్‌బ్యాగులు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.