హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు బ్యాడ్మింటన్ పోటీలు

CTR: ఉమ్మడి చిత్తూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ జూనియర్ బాల బాలికల జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్నట్లు చిత్తూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి బాలాజీ తెలిపారు. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మునగల పాలెంలో పోటీలు జరుగుతాయన్నారు. 2007 జనవరి 2 తర్వాత జన్మించిన క్రీడాకారులు మాత్రమే ఈ ఎంపికలకు అర్హులన్నారు.