హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

HYD: శ్రీ గురునానక్ దేవ్ జీ 557వ జయంతి సందర్భంగా ఇవాళ సిక్కులు ఊరేగింపు నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అశోకబజార్ గురుద్వారా నుంచి అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, పుత్లీబౌలి, గౌలిగూడ మీదుగా తిరిగి గురుద్వారాకు చేరుకోనుంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు అమలు చేయనున్నారు.