హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దరఖాస్తుల స్వీకరణ పకడ్బందీగా చేపట్టాలి'

ASF: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ పకడ్బందీగా చేపట్టాలని ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రతి కుటుంబం నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని, గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.