వైఎస్ఆర్ కడప జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. 13 మండలాల్లో సర్పంచ్ స్థానాలకు 1,079, వార్డు సభ్యులకు 3,257 కలిపి మొత్తం 4,336 నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. నవంబర్ 21న పరిశీలన, 24న ఉపసంహరణ, 29న పోలింగ్, ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రెండో విడతలో జిల్లాలో నామినేషన్లు ఎన్నంటే?


