ASF: వాంకిడి మండలం సరండి ప్రాథమిక పాఠశాల HM మద్యం తాగి పాఠశాలకు వస్తున్నట్లు చిన్నారులు తెలిపారు. ఆఫీసు పనుల పేరుతో మధ్యాహ్నం బయటకు వెళ్లి తాగి వస్తున్నాడని ఆరోపించారు. గతంలోనూ ఫిర్యాదులు వచ్చినా చర్యలు లేవని గ్రామస్థులు అన్నారు. సర్పంచ్ బాపూజీ విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అధికారులు విచారణ జరిపి HM పై చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
HM మద్యం తాగి వస్తున్నట్లు విద్యార్థుల ఆరోపణ


