WNP: జిల్లాకు చెందిన ఈశ్వర్,అవంతి దంపతులకు గాంధీ ఆసుపత్రి ఐవీఎఫ్ కేంద్రం ద్వారా ఒకే కాన్పులో ముగ్గురు మగ శిశువులు జన్మించారు. 32 వారాలకే ముందస్తు ప్రసవం కాగా,నెలలు నిండని శిశువులకు ఎన్ఐసీయూలో చికిత్స అందించారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండటంతో శుక్రవారం డిశ్చార్జి చేశారు. తొమ్మిదేళ్ల నిరీక్షణ తర్వాత 3 బిడ్డలు జన్మించడంతో కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.
తెలంగాణ
తొమ్మిదేళ్ల నిరీక్షణకు ముగ్గురు మగ బిడ్డలు


