హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలల రక్షణకు సమగ్ర ప్రణాళిక

సూర్యాపేట జిల్లాలో బాలల హక్కులు, భద్రత, సంక్షేమం కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. శుక్రవారం ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా యునిసెఫ్ సహకారంతో బాలల రక్షణ వ్యవస్థ బలోపేతం (CPSS) కార్యక్రమాన్ని ప్రకటించారు. ‘పిల్లల గళం’ కార్యక్రమం ద్వారా 9,558 మంది పిల్లల అభిప్రాయాలను సేకరించినట్లు తెలిపారు.