హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలి: సీపీ

NZB: శీతాకాలం నేపథ్యంలో రహదారులపై దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ముఖ్యంగా తెల్లవారు జాము నుంచి ఉ.8 గంటల వరకు పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ఈ సమయంలో రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించకపోవచ్చన్నారు. వాహనదారులు వేగాన్ని తగ్గించి, జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు.