హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ బీమా పథకానికి ప్రత్యేక అధికారుల నియామకం

BHPL: జిల్లాలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కలెక్టర్ రాహుల్ శర్మ ప్రత్యేక అధికారులను నియమించారు. మంథని నియోజకవర్గానికి సబ్ కలెక్టర్ సౌరభ్ శర్మ, భూపాలపల్లి నియోజకవర్గానికి రెవెన్యూ డివిజనల్ అధికారి పి. హరికృష్ణను నియోజకవర్గ నోడల్ అధికారులుగా నియమించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించనున్నారు.