హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు ప్రత్యేక లోక్ అదాలత్

MBNR: నేడు ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు మహబూబ్‌నగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత తెలిపారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న చెక్ బౌన్స్ కేసులను ఇరుపక్షాల అంగీకారంతో రాజీమార్గంలో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. లోక్ అదాలత్ ద్వారా సమయం, డబ్బు ఆదా చేసుకోవడంతో పాటు, త్వరగా న్యాయం పొందవచ్చని సూచించారు.