హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచి మోడల్ స్కూల్లో సైన్స్ మేళా

MHBD: జిల్లా కేంద్రంలోని అనంతారం తెలంగాణ మోడల్ స్కూల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు జిల్లాస్థాయి ఇన్ స్పైర్ పీఎంశ్రీ, ఆర్ఎస్ బీవీపీ సైన్స్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా సైన్స్ అధికారి బి. అప్పారావు తెలిపారు. 72 ఇన్ స్పైర్, 42 పీఎంశ్రీ పాఠశాల సైన్స్ ఎగ్జిబిట్లు, 263 ఆర్ఎస్ బీవీ ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించనున్నారని పేర్కొన్నారు.