హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి'

NGKL: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామంలో ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు. అర్హులైన లబ్ధిదారులకు బీమా పత్రాలను అందజేశారు. కుటుంబ పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలకు రూ.5 లక్షల బీమా ఆర్థిక భరోసాగా నిలుస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.