హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఊర్కొండ మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా

NGKL: ఊర్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎండీ అయ్యూబ్ పాషా రాజీనామా చేశారు. 35 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేశానని, గత మూడు నెలలుగా మండల కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత వర్గ పోరు, విభేదాలు తీవ్రంగా బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆత్మగౌరవాన్ని చంపుకుని పదవిలో కొనసాగలేనని స్పష్టం చేస్తూ రాజీనామా చేశారు.