హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎక్సైజ్ దాడులు.. రెండు లీటర్ల నాటుసారా స్వాధీనం!

GDWL: కేటిదొడ్డి మండలం ఇరికిచేడు తండాలో గద్వాల ఎక్సైజ్ సిబ్బంది దాడులు నిర్వహించారు. రెండు లీటర్ల నాటుసారా, ఐడీ లిక్కర్ స్వాధీనం చేసుకుని ఓ నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ అధికారి లింగా చారి తెలిపారు. అక్రమ మద్యం ప్రజారోగ్యానికి హానికరమని, తయారీ, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.