హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ బీమాతో పేదలకు భరోసా

GDWL: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని గద్వాల మున్సిపల్ ఛైర్‌పర్సన్ తుమ్మల జయలక్ష్మి సూచించారు. శుక్రవారం జమ్మిచేడులో నిర్వహించిన నమోదు శిబిరంలో ఆమె పాల్గొన్నారు. రేషన్ కార్డు ఆధారంగా నామినీ వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.