NRPT: చట్టం తెలుసుకుంటేనే బాల్యం సురక్షితమని లీగల్ ఎయిడ్ కౌన్సిల్ లక్ష్మిపతి గౌడ్ అన్నారు. నారాయణపేట PHC పాఠశాలలో సురక్షిత్ బచ్‌పన్ అభియాన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహం, బాల కార్మిక చట్టాలపై ఆయన వివరించారు. 18 ఏళ్ల లోపు వివాహం నేరమని, 14 ఏళ్ల లోపు పనిచేయించడం శిక్షార్హమని తెలిపారు. అన్యాయం జరిగితే 1098కు కాల్ చేయాలని సూచించారు.
తెలంగాణ
'చట్టం తెలుసుకుంటేనే బాల్యం సురక్షితం'


