హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీ భీమేశ్వర ఆలయంలో వైభవంగా కార్తీకదీపోత్సవం

SRCL: వేములవాడ రాజన్న ఆలయ అనుబంధాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం పదో రోజు సామూహిక కార్తీక దీపోత్సవాన్ని ఆలయ పర్యవేక్షకులు నరేందర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈనెల 10- డిసెంబర్ 8 వరకు ప్రతిరోజూ సాయంత్రం 6- రాత్రి 8 గంటల వరకు సుహాసినుల ఆధ్వర్యంలో దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.