TG: కాంగ్రెస్ సోషల్ మీడియా ఖాతా నుంచి ఓ పోస్టును తొలగించడంపై యూత్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా రాయదుర్గంలోని మెటా కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. సోషల్ మీడియా వేదికలు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన 21 మంది నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
వార్తలు
మెటా ఆఫీస్ వద్ద యూత్ కాంగ్రెస్ నిరసన


