ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో పాలస్తీనా ప్రజలకు అనుకూలంగా ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ మద్దతు తెలిపింది. ఆక్రమిత పాలస్తీనా ప్రాంతంలో యూదు ఆవాసాల ఏర్పాటును ఈ తీర్మానం తీవ్రంగా వ్యతిరేకించింది. పాలస్తీనా ప్రజలకు స్వయం నిర్ణయాధికారం ఉందని నొక్కి చెప్పింది. 193 దేశాల సభలో 162 దేశాలు తీర్మానానికి మద్దతు పలికాయి. అమెరికా, ఇజ్రాయెల్ సహా 8 దేశాలు దీనిని వ్యతిరేకించాయి.
వార్తలు
UNOలో పాలస్తీనాకు భారత్ మద్దతు


