హైదరాబాద్: 28°C
వార్తలు

కొండగట్టుకు నిధుల కోసం సీఎంతో చర్చిస్తా: స్పీకర్

TG: కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధుల కోసం సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ తెలిపారు. కొండగట్టు చందనోత్సవ మహోత్సవాల్లో భాగంగా ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఎదురయ్యే వాతావరణ మార్పులు, కరువు పరిస్థితులను అధిగమించే శక్తిని ప్రజా ప్రభుత్వానికి ప్రసాదించాలని అంజన్నను ప్రార్థించినట్లు స్పీకర్ తెలిపారు.