హైదరాబాద్: 28°C
వార్తలు

వినాయకుడి విగ్రహం.. గిన్నిస్ రికార్డ్

ఇండోనేసియాలోని బాలి ద్వీపంలో ఏర్పాటు చేసిన 50.2 అడుగుల వినాయకుడి విగ్రహం గిన్నిస్ రికార్డు సృష్టించింది. సింథటిక్ రట్టాన్ ప్లాస్టిక్‌తో నిర్మించిన అతిపెద్ద కళాఖండంగా ఇది గుర్తింపు పొందింది. ఓ పీఠంపై ఏర్పాటు చేసిన అత్యంత ఎత్తయిన ప్లాస్టిక్ విగ్రహంగా రికార్డులకెక్కింది. పీఠంతో కలిపి దీని మొత్తం ఎత్తు 72 అడుగులకు పైనే ఉంది. బాలిలోని జియాన్యార్ ప్రాంతంలోని పర్యాటక కేంద్రం వద్ద దీనిని నెలకొల్పారు.