హైదరాబాద్: 28°C
వార్తలు

మేకెదాటు వివాదంపై డీకే శివకుమార్‌ స్పందన

కావేరి నీటి వివాదం, మేకెదాటు ప్రాజెక్టుపై తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ మాణికం ఠాగూర్ చేసిన విమర్శలపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ స్పందించారు. వీటిపై కొందరు మిత్రులు ఆరోపణలు చేస్తున్నారని, వారికి వాస్తవాలు వివరిస్తానని తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కాగా, మేకెదాటు ప్రాజెక్టు నిర్మాణం చేపడితే కావేరి డెల్టా ఎడారిగా మారుతుందని మాణికం ఠాగూర్ ఆందోళన వ్యక్తం చేశారు.