హైదరాబాద్: 28°C
వార్తలు

అజిత్ దోవల్‌కు సమన్లు.. స్పందించిన భారత్

తనను హతమార్చేందుకు భారత అధికారులు కుట్ర పన్నారని ఆరోపిస్తూ గురుపత్వంత్ సింగ్ పన్నూ అమెరికాలో దావా వేసిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీ కోర్టు ద్వారా అజిత్ దోవల్, రా మాజీ చీఫ్ సామంత్ గోయల్‌పై సమన్లు జారీ చేయాలని అమెరికా ఫెడరల్ కోర్టు అభ్యర్థించింది. ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ స్పందించారు. 'మేం ఇటువంటి నిరాధారమైన దావాలను తిరస్కరిస్తున్నాం. ఆ విషయంలో మా వైఖరి ఇదే' అని స్పష్టం చేశారు.