హైదరాబాద్: 28°C
వార్తలు

'బాలల భద్రత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత'

కడప జిల్లా చింతకొమ్మదిన్నె జడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు బాలల హక్కులు, భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీనియర్ సివిల్ జడ్జి బాబా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ.. బాలల రక్షణ అందరి బాధ్యతన్నారు. వేధింపులు, బాల్యవివాహాలు, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 1098, 15100 హెల్ప్‌లైన్ నంబర్లను వివరించారు.