హైదరాబాద్: 28°C
వార్తలు

ఒంటిమీద రూ.10 కోట్ల బంగారంతో..

ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో బీహార్‌కు చెందిన 'గోల్డ్ మ్యాన్' ప్రేమ్ కుమార్ సింగ్ సందడి చేశారు. ఒంటి మీద సుమారు రూ.10 కోట్ల విలువ చేసే ఆరు కేజీలకుపైగా బంగారు ఆభరణాల్ని ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన్ను చూసి స్థానికులు సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.