హైదరాబాద్: 28°C
వార్తలు

ఉద్యమకారుల సమస్యలపై 22న సమరభేరి

MLG: తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని టీయూఎఫ్ జిల్లా అధ్యక్షుడు పోరిక గోవింద్ నాయక్ డిమాండ్ చేశారు. ఉద్యమకారుడు అచ్చ విద్యాసాగర్ మృతికి నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు. ఈ నెల 22న మేడారంలో జరిగే రాష్ట్రస్థాయి సమావేశానికి ఉద్యమకారులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు.