BHPL: టేకుమట్ల (M) రామకృష్ణాపూర్(టి) గ్రామంలో ఆత్మ ఆధ్వర్యంలో వరి పంటపై పొలంబడి, క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. మండల వ్యవసాయాధికారి మెరుగు కళ్యాణి రైతులకు ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించి అధిక లాభాలు పొందాలని సూచించారు. వరి కోతల అనంతరం కొయ్యలను కాల్చకుండా పొలంలో కలియదున్నడం వల్ల నేలలో సేంద్రియ కర్బనం పెరుగుతుందని వివరించారు.
తెలంగాణ
యాసంగిలో ఆరుతడి పంటలే మేలు: MAO


