హైదరాబాద్: 28°C
తెలంగాణ

నషా ముక్త్ ప్రచార రథం ప్రారంభం

ADB: నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా ఆదిలాబాద్ బ్రహ్మకుమారీల సేవా కేంద్రంలో మిషన్ స్పందన అవగాహన కార్యక్రమం జరిగింది. కలెక్టర్ రాజర్షి షా ప్రచార రథాన్ని ప్రారంభించారు. మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును, కుటుంబాలను దెబ్బతీస్తాయని, వ్యసన రహిత సమాజానికి ముఖ్యంగా యువత బాధ్యత వహించాలని ఆయన పిలుపునిచ్చారు. బ్రహ్మకుమారీలు, ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా ఈ ప్రచారం చేపడుతున్నాయి.