హైదరాబాద్: 28°C
వార్తలు

బైక్ ట్యాక్సీలకు సుప్రీం లైన్ క్లియర్

కర్ణాటకలో బైక్ ట్యాక్సీల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బైక్ ట్యాక్సీలపై నిషేధాన్ని పునరుద్ధరించాలని కోరుతూ కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కొట్టేసింది. పూర్తిస్థాయి నిషేధం కంటే నిబంధనలతో నియంత్రించడమే ఉత్తమమని స్పష్టం చేసింది. GPS ట్రాకింగ్ సదుపాయం ఉండటం వల్ల యువతులకు బైక్ ట్యాక్సీలు సురక్షితమని, ఆటోలతో పోలిస్తే ఛార్జీలు తక్కువగా ఉంటాయని తెలిపింది.