MNCL: జన్నారం మండలం రాంపూర్‌లో అనారోగ్యంతో మృతి చెందిన గల్ఫ్ కమిటీ సభ్యుడు సుంకరి రాజన్న భార్య లక్ష్మి కుటుంబానికి గల్ఫ్ కార్మిక సంక్షేమ సమితి సభ్యులు రూ.14 వేల ఆర్థిక సాయం అందజేశారు. కుటుంబానికి అండగా నిలిచిన సభ్యుల తీరును గ్రామస్తులు ప్రశంసించారు. వ్యవస్థాపకుడు కల్లెడ భూమయ్య, గ్రామ అధ్యక్షుడు లింగాల వెంకటేష్, రాష్ట్ర కన్వీనర్ సందా సుదర్శన్ పాల్గొన్నారు.