హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెడికల్‌పై TG SAFE దాడులు

WGL: వర్ధన్నపేటలోని వెంకటేశ్వర మెడికల్‌పై TG SAFE అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ప్రిస్క్రిప్షన్ లేకుండానే మత్తు కలిగించే దగ్గు సిరప్‌లు, క్లోనాజిపామ్ టాబ్లెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దాడుల్లో మందులను, కొనుగోలు ఇన్వాయిస్‌లు, కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. షాప్ నిర్వాహకులు, ఫార్మసిస్ట్‌పై విచారణ చేపట్టారు.