హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్తూరులో ఇందిరమ్మ బీమాపై అవగాహన

MNCL: లక్సెట్టిపేట మండలం కొత్తూరు గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభమై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. వెంకట్రావుపేట సర్పంచ్ నలిమేల రాజు, ఎల్లారం సర్పంచ్ రాజేశం, తదితరులు కూడా హాజరయ్యారు. ప్రతి ఇంటికీ ఆర్థిక భరోసా ఇచ్చే ఈ పథకాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజిత, మండల ప్రత్యేకాధికారి అవినాష్, ఎంపీడీవో అనిల్ కుమార్ పాల్గొన్నారు.