హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ పెన్షన్ పంపిణీలో ప్రోటోకాల్ వివాదం

KMR: ఇందిరమ్మ పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీలో ప్రోటోకాల్ పాటించలేదని జుక్కల్ మండలంలోని పలువురు సర్పంచులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్పంచుల స్థానంలో కాంగ్రెస్ కార్యకర్తలకు పత్రాలు అందజేయడంపై ఎంపీడీవో కార్యాలయంలో అసంతృప్తి తెలిపారు. దీనిపై టీఆర్పీ నియోజకవర్గ అధ్యక్షుడు ఖండేరావు స్పందిస్తూ, ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు.