హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండల స్థాయి క్విజ్ పోటీలు విజయవంతం: అ. కలెక్టర్

MDK:  జిల్లాలోని 21 మండలాల్లో శుక్రవారం ప్రభుత్వ పాఠశాలల 8, 9, 10 తరగతుల విద్యార్థులకు మండల స్థాయి క్విజ్ పోటీలు విజయవంతంగా జరిగాయని అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. మండలానికి ముగ్గురు చొప్పున ఎంపికైన 63 మందికి ఈ నెల 26న సెమీఫైనల్, డిసెంబర్ 2న కలెక్టరేట్‌లో ఫైనల్ నిర్వహించి రూ.90వేలు, రూ.60వేలు, రూ.30వేల నగదు బహుమతులు ఇస్తామన్నారు.