హైదరాబాద్: 28°C
తెలంగాణ

56 ఉద్యోగాలకు భారీ స్పందన

సిద్దిపేట జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్న 56 పోస్టులకు 1,099 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ప్రియాంక తెలిపారు. దరఖాస్తుల వివరాలను అధికారిక వెబ్‌సైట్లో పొందుపరచనున్నట్లు చెప్పారు. వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.