హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలల హక్కుల రక్షణకు కృషి చేయాలి: కలెక్టర్

MDK: మెదక్ కలెక్టరేట్‌లో శుక్రవారం ప్రపంచ బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు 492 గ్రామాల్లో బాలల రక్షణ కమిటీలను పునరుద్ధరిస్తామన్నారు. అనంతరం బాలల హక్కుల పాటను ఆవిష్కరించి, విజేతలకు బహుమతులు అందజేశారు. డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి రుభిన ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.