హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ DIEOగా ప్రభావతి బాధ్యతల స్వీకరణ

MDK: జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఇంఛార్జీ అధికారిగా ప్రభావతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం తూప్రాన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఆమెకు DIEO ఇంఛార్జీ బాధ్యతలు అప్పగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆమెకు అభినందనలు తెలిపారు.