హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసులకు ప్రత్యేక శిక్షణ పూర్తి

MBNR: సేవ్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసులకు నిర్వహించిన రెండు రోజుల ప్రత్యేక శిక్షణ శుక్రవారం ముగిసింది. ప్రమాద బాధితులకు ప్రథమ చికిత్స, సీపీఆర్, ప్రమాద స్థల పరిశీలన, ఆధారాల సేకరణపై శిక్షణ ఇచ్చారు. ఎస్పీ డి. జానకి, డీఎల్‌ఎస్‌ఏ ఛైర్‌పర్సన్ ఇందిరా పాల్గొనగా, 60 మంది పోలీసు సిబ్బంది శిక్షణ పొందారు.