హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలల హక్కుల పరిరక్షణకు పిలుపు

BDK: ప్రతి బాలుడికి సురక్షిత బాల్యం, నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్యం, సమాన అవకాశాలు కల్పించాలని భద్రాద్రి జిల్లా సంక్షేమ అధికారిణి కే.ఎం. తార అన్నారు. అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా చుంచుపల్లి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బాల కార్మికత్వం, బాల్యవివాహాలు, బాలలపై వేధింపుల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.