KMR: మద్నూర్ డిగ్రీ కళాశాలకు చెందిన ఎం.రాధికకు జిల్లా స్థాయిలో భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్ పోటీల్లో ప్రథమ బహుమతి వచ్చిందని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కే.అశోక్ తెలిపారు. కలెక్టర్ ఆషీస్ సాంగ్వాన్ చేతుల మీదుగా బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
క్విజ్ పోటీల్లో మద్నూర్ విద్యార్థిని సత్తా


