హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు

నిర్మల్ జిల్లాలోని ఆసరా కాలనీలో టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పెద్దలు మాట్లాడుతూ దేశం కోసం టిప్పు సుల్తాన్ చేసిన పోరాటాలు, ఆయన ప్రదర్శించిన ధైర్యం, త్యాగాల గురించి పిల్లలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆసరా కాలనీకి చెందిన మహిళలు, యువకులు మరియు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.