హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రగ్స్ వ్యతిరేకంగా విద్యార్థుల ప్రతిజ్ఞ

MDCL: ఘట్‌కేసర్‌లోని రిషి పాఠశాలలో పోలీసులు రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 200 మంది విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, అపరిచితులు ఇచ్చే ఆహార పదార్థాలను స్వీకరించకూడదనే అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించి సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.